ప్రశ్న సమాధానం ....... My Writings #3


ఒక మనిషి ఒకసారి సక్సెస్ అవుతాడు ఇంకోసారి ఫెయిల్ అవుతాడు. ఎందుకు? ఒక పని చేసే ఇంటరెస్ట్ స్టార్టింగ్ లో ఉనంతా తరువాత ఉండదు, ఎందుకు?  ఇలాంటి ప్రశ్నలకు  ఆన్సర్స్ ఈ బ్లాగ్ లో నాకు దొరుకుతాయో లేదో చూదాం. ఈ questions  కి answers  మీకు తెలుసు అంటే ఇక్కడనుంచి ఈ బ్లాగ్ ని చదవాల్సిన అవసరం లేదు.

తెలుగు గీక్స్ ఐడియా మా అన్నయ కి రాకముందు, నేను ఫిలిం మేకింగ్ నేర్చుకుంటాకి  ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మా అన్నయ medicine  అండ్ diseases  కి సమందించి ఒక ఛానల్ చేస్తూ ఉండేవాడు, మావాడు డాక్టర్ కాబట్టి . మా అన్నయ ఛానల్ గ్రోత్ స్లో గా ఉండేది, నా ఛానల్ గ్రోత్ అయితే అసలు ఉండేది కాదు, ఎంత అనుకున్న వారానికి ఒక వీడియో పెట్టడం చాల కష్టంగా  అనిపించింది. అప్పుడు మా అన్నయ ఒక ఆలోచన కి వచ్చాడు, ఎందుకు మన ఇద్దరం ఒక ఛానల్ మీద వర్క్ చేయకూడదు అని, నాకు కరెక్టే అనిపించింది, దేని మీద చేదాం అని అడిగాను, బుక్ సమ్మరీస్ మీద అన్నాడు, మా వాడు పుస్తకాలు చదువుతాడు, నాకు తెలుసు, కానీ నేను ఎం చేస్తాను ఇందులో? ఈ ఛానల్ వల్ల నా ఫిలిం మేకింగ్ గోల్ కి ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచించాను. ఆ సమయం లో ఇంకా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు, స్టార్ట్ చేసాం, మొదటిలో కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్ట్స్ మీద వీడియోస్ చేసాం, దాని తో పాటు బుక్ summaries చేసాం, నాకు బాగా గుర్తు మొదటి 100 subscribers  రావటం నాకు తెలిసి అతి కష్టమైనా విషయం, కొలాబరేషన్ కోసం మనం వేరే వాళ్ళని అడగము ఎందుకు అంటే ఇంట్రావర్ట్ అవ్వటం లో ఉన్న ఒక నష్టం అది, సరే అని కొంతమందిని అడిగి collab  చేసాం, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు, తరువాత సాయి కృష్ణ ఛానల్ తో collab  చేసాం, అక్కడ కొంచెం subscribers  వచ్చారు, ఒక 350 కి వచ్చేసాం, హమ్మయ్య అనుకుంటున్నాము, అప్పుడే మొదటి పది వేల వ్యూస్ వస్తే కానీ పైసా ఇచ్చేది లేదు అని గూగుల్ adsense కొత్త రూల్ తీసుకొచ్చింది, అప్పటిదాకా 10 $ అని కనపడిన అమౌంట్ మాయం అయిపోయింది, కానీ అదే సమయం లో " ఇండియా లో ఆదిమానవులు ఉన్నారు జాగ్రత్త " అని ఒక వీడియో క్లిక్ అయ్యింది, ఎందుకో ఆ వీడియో ని జనాలు ఎక్కువ చూడటం మొదలుపెట్టారు, ఆ వీడియో ఏంటంటే అండమాన్ నికోబర్ ఐలాండ్స్ దగ్గర  నివసించే ఒక తెగ గురించి. అది ఒకటే 10k వ్యూస్ దాకా వచ్చాయి, సరే మనం ఫాక్ట్స్ ఎక్కువ చేదాం అనుకునే సమయానికి, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీ కి ట్రాఫిక్ పెరిగింది, ఎందుకో జనాలు ఆ వీడియో ని ఎక్కువ గా చూస్తున్నారు, వెంటనే ఇంకో రెండు వీడియోలు ఆ పుస్తకం మీద చేసాం అవి బాగా వెళ్లాయి, ఆలా కొన్ని పుస్తకాలు kindle  , kobo , scribd లో కొనటం,చదవటం, సమ్మరీలు రాయటం, మా అన్నయ ఆల్రెడీ చాల పుస్తకాలు చదివేశాడు వాటి సుమ్మారీస్ చేయటం వాడు స్టార్ట్ చేసాడు. కంటెంట్ బాగా create  చేయగలిగాము.fidget స్పిన్నర్ మీద పెట్టిన ఒక వీడియో అయితే పెద్ద హిట్ అయ్యింది అది ఇప్పుడు దాదాపు గా 1 .5 మిలియన్ వ్యూస్ లో ఉంది మా ఛానల్ లో అదే హైయెస్ట్ viewed వీడియో.  ఈ లోపు బయట కొన్ని స్టార్టుప్ కంపెనీస్ నుంచి ఆల్రెడీ ఉన్న కంపెనీస్ నుంచి ఆఫర్స్ రావడం మొదలు అయ్యాయి, ఈ లోపు అప్ ఒకటి లాంచ్ చేసాము, వీటి మధ్యలో ఎక్కడో, మళ్ళి  యూట్యూబ్ మీద కొంచెం కాన్సంట్రేషన్ తగ్గినట్టు అనిపించింది, దానికి తగ్గటే వ్యూస్ పడిపోయాయి. అప్పుడు కారణం అర్ధం అవ్వలేదు. ఎందుకు అనుకునే వాళ్ళం, కానీ యూట్యూబ్ లో ఉండే మెయిన్ సీక్రెట్ అసలు యూట్యూబ్ సక్సెస్ కి కారణమైన ఆ ingredient ని మిస్ చేసాము అని తెలుసుకున్నాము, అది ఏంటి అంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పని చేయడం ఆపకూడదు, బయట నుంచి ఎన్ని ప్రాజెక్టులు వచ్చిన మన మెయిన్ ప్రాజెక్ట్ ని అసలు ఆపకూడదు. ఎప్పుడైతే నీ దృష్టి వేరే వైపుకి వెళ్తుందో, నువ్వు చేసే పని మీద నీకీ పట్టు తగ్గుది. యూట్యూబ్ అండ్ సక్సెస్ ఈ రెండు ప్రయాణాలె ఏది మజిలీ కాదు ఆగిపోవటానికి.       

నేను పైన అనుకున్న రెండు ప్రశ్నలకు నా స్టోరీ లో నుంచి నేను వెతుకున్న సమాధానం మన లోనే ఉంది, ధ్యాస మళ్ళించకు, గెలుపుకి ఆగకు.   

Jai hind.

-- 

Comments