A man tries to find happiness. is he successful? Or he should sacrifice his dreams to be happy?

అది ఎప్పుడో ఇంజనీరింగ్ అయిపోయాక . ఉద్యోగం చెయ్యాలి అంటేనే ఒక ఇష్టం ఉండేది కాదు, ఎందుకు ఉద్యోగం చేయాలి అని అనుకునేవాడిని, కాలేజీ లో కూడా నేను ఉద్యోగం చేయను రా  బాబు అనేవాడిని, సో , ఒక బిజినెస్ స్టార్ట్ చేదాం అని అనుకున్న, ఒక ఫ్రెండ్ ధ్వారా ఒక ప్రాజెక్ట్ తీసుకుని, ఒక పది లక్షలు ఇంట్లో తీసుకుని హైదరాబాద్ లోని కూకట్పల్లి లో ఆఫీస్ స్టార్ట్ చేశా, కంప్యూటర్స్, టేబుల్స్, అన్ని రెడీ అయిపోయాయి,  ఒక నలుగురు ని తీసుకుని ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేశా,స్లో గా ఆ పని నాకు ఇష్టం లేదు అని అర్ధం అయింది , పోను పోను చాలా కష్టాంగా అనిపించేది , ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ మీట్ అవ్వడానికి పని చేసే వాడిని , ఎలాగో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మొత్తానికి సబ్మిట్ చేశా, అది రివ్యూ కి వెళ్ళింది, తర్వాత తెలిసింది ఏంటి అంటే అది ఫేక్ ప్రాజెక్ట్ అని , వాడి తో గొడవ పడి, డబ్బులు పోగొట్టు కుని . ఇంకో ప్రాజెక్ట్ తీసుకుని ,మళ్ళి  అదే తప్పు చేశా మళ్ళి డబ్బులు పోగొట్టుకున్న, ఈసారి డబ్బు తో పాటు ఇంట్లో వాళ్ళ  దగ్గర నమ్మకం కూడా పోగొట్టుకున్న. అప్పుడు ఒక విషయం అర్ధం అయింది . ప్రాబ్లెమ్ ఆ ప్రాజెక్ట్ లో కాదు నాలోనే ఉంది అని , నేను ఒక బిజినెస్ చేయాలి అని చేశా , దాంట్లో  డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించ తప్ప , నా గురించి ఆలోచించలా,  ఆడు ఎవడికో ఉన్నదీ  ఊడితే సిగ్గు వచ్చింది అంట , నాకు ఇంత సమయం,డబ్బుపోతే కానీ జ్ఞానం రాలేదు , మనకి ఎందుకు ఆ కంగారు? జనాలకి నేను ఏదో చేస్తున్నాను అని చెప్పటానికి పని చేయాలా? నీకు ఆ పని చేయడం ఇష్టం , అందుకని పని చేయాలా? ఏది కరెక్ట్? జనాల కోసం పని చేయటం వల్ల అందరూ హ్యాపీ గా ఉంటారు , మీ అమ్మ నాన్న మీ చుట్టాలు అందరూ హ్యాపీ , కానీ మనం మారిపోతాం, ఇవన్నీ భరించలేక మనలోనుంచి మనమే  పారిపోతాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు లేదా 10th వరుకు నేను ఎం అనుకుంటే అది చేసే వాడిని తరువాత అది పోయింది, ఇప్పుడు నేను ఎం అనుకున్న చేయలేకపోతున్న అని? అదే వెతికా,   నేను ఒకటి తెలుసుకున్న, ఎవడైనా ఆనందం గా  ఉన్నాడు అంటే రెండు కారణాలు , ఒకటి తన ఫామిలీ హ్యాపీ గా  ఉంటె వాడు హ్యాపీ, రెండోవది వాడు హ్యాపీ గా ఉంటె వాడి ఫామిలీ హ్యాపీ . మొదటి దాంట్లో వాడి ఫామిలీ హ్యాపీ గా ఎలా ఉంటుంది వాడు జాబ్ చేసి టైం కి సాలరీ వస్తే హ్యాపీ, బట్ వాడు వాడికి ఇష్టమైన పనులను త్యాగం చేసి, అప్పుడప్పుడు వాటిని చేస్తాడు, కొంతమందిని మనం చూడొచ్చు ఉద్యోగం చేస్తూ పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టి, కొంచెం సెటిల్ అయ్యాక  , వీకెండ్స్ షార్ట్ ఫిలిమ్స్ లో ఆక్ట్ చేయడం,అప్పుడప్పుడు ఆడిషన్స్ కి వెళ్లడం, ఇలా.

రెండోవది నువ్వు నీకు నచ్చిన పని చేయటం , ఇందులో డబ్బు రాదు అందుకే ఇంట్లో కంగారుపడతారు, వీడి జీవితం ఏమవుతుంది అని అనుకుంటారు ,వాళ్ళ బాధ రోజు రోజు భయంగా మారుది, కానీ నువ్వు అసలు పట్టు వదలకుండా నీకు నచ్చిన పని చేసి దాంట్లోనుంచి డబ్బులు సంపాదించే మార్గం నువ్వు ఏర్పరుచుకుంటే , చివరికి వాళ్ళు కూడా హ్యాపీ , ఈ మధ్యలో ఉన్న కాలాన్ని నువ్వు ఎలా హేండిల్ చేయగలవు అనేదే million  dollar  question , ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియక , తర్జన భర్జన పడి , మనిషి త్యాగం చేస్తున్నాడు.
                         
                                                                                    

Comments

Post a Comment