A story of three friends , and how their life changed after engineering.

నాకు తెలిసి మనిషి నేర్చుకునే జీవిత పాఠాలు తన జీవితం లో జరిగే సంఘటనలు ఆధారంగా నేర్చుకుంటాడు, ఆ సంఘటనలే తన జీవితం మీద ఉన్న ఆలోచనను  మారుస్తుంది , 

 నేను ఇంజనీరింగ్ చదువుకునే రోజులు , నేను, గిరి , కాశీ  ముగ్గురు మంచి ఫ్రెండ్స్, మాలో గిరి  బాగా తెలివైనవాడు , ఎం మాట్లాడిన ఫిలాసఫీ టచ్ ఉంటుంది, ఏ విషయాన్ని అయిన కొత్త కోణం లో చూస్తాడు, ఆలోచిస్తాడు. నేను పెద్దగా మాట్లాడను , నా  పని నాది  అన్నట్టు ఉండేవాడిని , కాశీ  మా ముగ్గురు కంటే కొంచెం అమాయకుడు అతన్ని చాల మంది చాల రకాలుగా ఆడేసుకునేవారు, కానీ అతనికి తెలిసేది కాదు, అంత అమాయకుడు. మేము ముగ్గురు కూర్చున్నప్పుడు నాకు వాళ్లిదరు మాట్లాడుకునే విషయాలు విని ఎవడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తూ ఉండేవాడిని ,  కాశీ మాటలకు నవ్వుకునే వాడిని , గిరి  మాటలు కొన్ని నవ్వు వచ్చేవి కొన్ని ఆలోచింపజేసేవి . ఇది ఇలా ఉండగా  ఈలోపు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి, గిరి  కి ఒక సబ్జెక్టు పోయింది శశి కి రెండు సబ్జెక్టులు పోయాయి , నేను పాస్ అయిపోయా . మేము ముగ్గురు తరువాత కలిసి  మాట్లాడుకుంటుంటే కాశీ  ఏడ్చేశాడు , గిరి  ఓదారుస్తూ ఈజీ గా పాస్ అయిపోవచ్చు అని కాశీ కి ధైర్యాన్ని ఇచ్చాడు ,గిరి  కి ఉన్న ధైర్యం చూసి నాకు కూడా ఆనందంగా అనిపించింది. 

ఒక రెండు నెలలు తరువాత నేను  హైదరాబాద్ లో  ఒక కోర్స్ లో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్న సమయం లో , ఒక రోజు సడన్ వార్త , గిరి  సూసైడ్ చేసుకున్నాడు అని , నాకు అర్ధం కాలేదు ,సూసైడ్ అని అనటానికి కూడా బయపడి , ఎందుకు అని అడిగా , ఒక ఉత్తరం రాసాడు అని , ఆ ఉత్తరం లో సబ్జెక్టు ఫెయిల్ అవ్వటం వల్ల అని రాసాడు  అని చెప్పారు, నేను నమ్మలేదు వాడు ఏంటి సూసైడ్ చేసుకుంటం ఏంటి అని అనిపించింది , నేను అక్కడకి వెళ్ళాను, ఆ ఉత్తరం చదివాను అది వాడి రైటింగే , రెండు రోజులు అయింది నా మెదడు లో ఆలోచనల వేగం తగ్గట్ల , ఎవడైనా చంపేసి ఇలా చేయించాడు అని ఆలోచిస్తున్న, ఏమిటి కారణం నాకు అర్ధం కాలేదు , తరువాత వాళ్ళ బావ ని కలిసాను , ఆయన చెప్పారు , గిరి వాళ్ళ  ఇంట్లో, ఫెయిల్ అవ్వటం తెలిసి రోజు తిట్టేవారు అని , ఇంటికి వచ్చిన చుట్టాల ముందు కూడా  గిరి ని అవమానించారు  అని చెప్పారు. ఈ బాధ తో చాలా రోజులు ఉన్నాడు అని , తాను ఎప్పుడో ధైర్యం కోల్పోయాడు అని , ఇది నాలుగోవసారి సూసైడ్ అట్టెంప్ట్ చేసి ఈసారి కనుమూశాడు అని చెప్పారు. ఎంతో ధైర్యవంతుడిని కూడా ఒక వైఫల్యం పిరికివాడిని చేస్తుంది అని నాకు అప్పుడే అర్ధం అయింది.

 హైదరాబాద్ వచ్చేసాను , ఇక్కడ కాశీ పరిస్థితి అంతే ఉద్యోగం లేదు అని వాడి ఇంట్లో రోజు అవమానం , వాడి గర్ల్ ఫ్రెండ్ అయితే వాడికి ఉద్యోగం లేదు అని  రోజు కించ పరిచేది , నాతో చాల సార్లు చెప్పుకుని ఏడ్చేవాడు, స్వతహాగా అమాయకుడు ఏమవుతాడో అని అనుకునేవాడిని. ఒక కోర్స్ లో జాయిన్ అయ్యాడు, వాడికి ఆ కోర్స్ అయిపోయిన ఏమి అర్ధం కాలేదు , మళ్ళి జాయిన్ అయ్యాడు  , ఈసారి కొంచెం బానే నేర్చుకున్నాడు , ఉద్యోగం సంపాదించాడు , కానీ వాళ్ళ  ఇంట్లో వీడి మీద ఒత్తిడి తగ్గలేదు , నీకు వచ్చే పది వేలు ఎవడికి సరిపోతాయి అని వాళ్ళ ఇంట్లో , నాకు 20 వేలు వస్తున్నాయి నీ  బోడి 10  వేలు తో మా ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి  ఎలా మాట్లాడుతావ్ అని వాడి గర్ల్ ఫ్రెండ్ . మళ్ళి నా దగ్గరకి వచ్చి ఏడ్చాడు ,కానీ మళ్ళి  కష్టపడ్డాడు , ఆఫీస్ లో ఎక్కువగా కష్టపడేవాడు వాడే అని అందరూ నవ్వుకునేవారు , వాడికి ఆఫీస్ టేబుల్ అని పేరు కూడా పెట్టారు, వాటి ఆనీటిని వాడు పట్టించుకోలా రెండు ఏళ్లలో ఇంకో  మంచి కంపెనీ లో ప్లేసెమెంట్ సాధించి 70  వేలు జీతం కి ఎగబాకాడు , వాళ్ళ ఇంట్లో వాడి మీద గౌరవం పెరిగి వాళ్ళ నాన్న గారు వాడికి కార్ కొనిచ్చారు, వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంకా వాడిని ఏమి అనలేకపోతుంది ఎందుకంటే ఆ అమ్మాయి సాలరీ ఇంకా 35   వేలు దగ్గరే ఉంది . 

ఇదంతా చూస్తున్న నాకు అనిపించింది ఒక మూడు ఏళ్ళ క్రితం గిరి,కాశీ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కదా , ఎంతో తెలివైనవాడైన గిరి సూసైడ్ ఎలా చేసుకున్నాడు , అమాయకుడు అనుకున్న కాశీ ఎలా గెలిచాడు? 

choice , గిరి అది choose చేసుకున్నాడు, కాశీ ఇది choose  చేసుకున్నాడు. 

ఒరేయ్ గిరి,  క్షణిక ఆవేశం లో అప్పుడు జరిగిన  కొన్ని సంఘటనల ఆధారంగా నువ్వు చనిపోయి  ,ఏమి సాధించావ్?  జీవితం అంటే ఇంతే అనుకుని నువ్వు చేసిన పని ఎంత నీచం ?
కాశీ లా ఓటమిలో కూడా గెలవాలి ? బాధ వచ్చిన ఓర్చుకుని ముందుకు వెళ్లి నువ్వు అనుకుంటే ఎం  సాధించగలవో చూపించాలి. అది మన పుట్టుకకి పరమార్ధం అని తెలుసుకోలేకపోయావ్ .  ఆత్మహత్య చేసుకునే ముందు  ఒక్క నిమిషం ఆలోచించి , ఈ బాధ గతం లోకి వెళ్ళిపొది   నువ్వు భవిష్యత్తు లోకి వెళ్తావు అని ఎందుకు అనుకోలేదు ? 

ఇంకా అప్పుడు నుంచి తెలివి ని బట్టి మనిషిని అంచనా వేయడం మానేసాను , ఎవడైతే కష్టపడతాడో , అన్ని బాధలను దిగమింగి  కష్టపడతాడో , వాడే మనిషి అని తెలుసుకున్నాను .



NOTE : I have changed names of my friends. But what happened is unchanged.   

Comments